nava deep: ట్రాఫిక్ సిగ్నల్ పై హీరో నవదీప్ సెటైర్లు!

  • ఓ ట్రాఫిక్ సిగ్నల్ ఫొటోను పోస్ట్ చేసిన నవదీప్
  • రెడ్ లైట్ తో పాటు స్ట్రయిట్, లెఫ్ట్ సిగ్నల్స్ వెలుగుతున్న వైనం
  • నవదీప్ పోస్ట్ పై నెటిజన్ల భిన్న వ్యాఖ్యలు

కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా పని చేయని సందర్భాలు చూస్తూనే ఉంటాం. ఇలాంటి సంఘటన గురించే  ప్రముఖ హీరో నవదీప్ ప్రస్తావించాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ వెలుగుతుండగా, స్ట్రయిట్, లెఫ్ట్ సిగ్నల్స్ కూడా వెలుగుతూ ఉండటం గమనించవచ్చు. ఈ సందర్భంగా నవదీప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. కాగా, ‘సూపర్,’ ‘ఎర్ర లైట్ ఎందుకు?’, ‘ఓకే ఫైన్’, ‘ఏ ప్లేస్ లో జరిగింది?’ అంటూ నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News