shopping malls: మహిళలపై ప్రభావం చూపుతున్న 'అందమైన బొమ్మలు'.. తాజా సర్వే!

  • భారత్‌లోని 420 పట్టణాల్లో మహిళల అభిప్రాయాల సేకరణ
  • తమ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయన్న మహిళలు
  • మహిళలపై హీనభావం పెరుగుతోందన్న సర్వే

పలు దుకాణాల ముందు ప్రదర్శనకు ఉంచే అందమైన అమ్మాయల బొమ్మల ప్రభావం మహిళల్లో ఎలా ఉంటుందనే విషయంపై టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్‌ఎస్) సర్వే నిర్వహించి పలు చేదు నిజాలను వెల్లడించింది. కస్టమర్లను ఆకర్షించేందుకు పెట్టే ఆ బొమ్మల కారణంగా మహిళలపై హీనభావం పెరుగుతోందని పేర్కొంది.

అలాగే, వీటిని చూసే మహిళలు తాము అలా లేమని ఫీలవుతుంటారని తేలింది. భారత్‌లోని 420 పట్టణాల్లో సర్వే నిర్వహించి, ఇటువంటి బొమ్మలపై మహిళల అభిప్రాయాలు తీసుకుని టీఐఎస్‌ఎస్ ఈ నివేదిక రూపొందించింది. అభిప్రాయాలు చెప్పిన మహిళల్లో చాలా మంది ఈ బొమ్మలు తమ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని అన్నారు.

shopping malls
india
  • Loading...

More Telugu News