modi: టీడీపీ ఎంపీలకు లభించని మోదీ అపాయింట్ మెంట్!

  • మోదీ అపాయింట్ మెంట్ కోరిన టీడీపీ ఎంపీలు
  • సమయం కేటాయించని ప్రధాని కార్యాలయం 
  • ఏపీ భవన్ లో భేటీ కానున్న ఎంపీలు

ఉక్కు పరిశ్రమ కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న ఆమరణదీక్ష గురించి ప్రధాని మోదీని కలిసి... వివరించాలనుకున్న టీడీపీ ఎంపీలకు నిరాశ ఎదురైంది. అపాయింట్ మెంట్ కావాలని ఎంపీలు కోరగా... ప్రధాని కార్యాలయం వీలుకాదని చెప్పింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఎంపీలు ఏపీ భవన్ లో భేటీ కానున్నారు. అనంతరం ఉక్కు శాఖ మంత్రిని కలిసి... ఆయనకు చంద్రబాబు రాసిన లేఖను అందజేయనున్నారు.

మరోవైపు, సీఎం రమేష్ చేస్తున్న దీక్ష తొమ్మిదవ రోజుకు చేరుకుంది. షుగర్ లెవెల్స్ పడిపోతుండటంతో... ఆయన ఆరోగ్యం విషమిస్తోంది. మరో టీడీపీ నేత బీటెక్ రవి ఆరోగ్యం క్షీణించడంతో... నిన్న ఆయనను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లుండి కడపకు రానున్నారు.

modi
Telugudesam
mp
appointment
  • Loading...

More Telugu News