Venkaiah Naidu: రేపు కొత్త రూ.125 నాణెంని విడుదల చేయనున్న వెంకయ్య నాయుడు

  • రేపు గణాంకాల నిపుణుడు పీసీ మహాలనోబిస్‌ 125వ జయంతి
  • ఆయన గౌరవార్థం కొత్త రూ.125 నాణెం విడుదల
  • కోల్‌కతాలో జరగనున్న జయంతి వేడుకలు

గణాంకాల నిపుణుడు పీసీ మహాలనోబిస్‌ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా జూన్‌ 29న 'గణాంకాల దినోత్సవం'గా నిర్వహిస్తుంది. రేపు మహాలనోబిస్‌ 125వ జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం రూ.125 నాణెంతో పాటు కొత్త రూ.5 నాణెంని కూడా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేయనున్నారు.

సామాజిక-ఆర్థిక ప్రణాళికలు, పాలసీ రూపకల్పన విషయంలో గణాంకాల ప్రాధాన్యతను   దేశ ప్రజలకు వివరించి చెప్పేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. కాగా, రేపు కోల్‌కతాలో మహాలనోబిస్‌ జయంతి వేడుకని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ), స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి.

Venkaiah Naidu
India
rs 125
coin
  • Loading...

More Telugu News