shakalaka shankar: హీరోగా చేస్తూనే కమెడియన్ గా కొనసాగుతా: షకలక శంకర్

  • కమెడియన్ గా షకలక శంకర్ బిజీ 
  • హీరోగాను వస్తోన్న అవకాశాలు 
  • ఆ వేషాలకే ఫిక్స్ కాలేదంటూ వివరణ    

తెలుగు తెరపై సందడి చేస్తూ వచ్చిన కమెడియన్స్ లో కొంతమంది హీరోగాను తమ ముచ్చట తీర్చుకున్నారు. అయితే వాళ్లలో బ్రహ్మానందం .. అలీ వంటివారు కమెడియన్ గా చేస్తూనే .. అవకాశం వచ్చినప్పుడు హీరోగా ప్రేక్షకులను పలకరించారు. అందువలన వాళ్లకి రావలసిన  అవకాశాలు వాళ్లకి దక్కుతూనే వచ్చాయి. సునీల్ మాత్రం హీరోగా బిజీ కాగానే కామెడీ వేషాలకి దూరమయ్యాడు.

ఈ కారణంగా సునీల్ కి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది. అది దృష్టిలో పెట్టుకున్నాడో ఏమో .. తాను మాత్రం కమెడియన్ గా చేస్తూనే హీరోగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటానని షకలక శంకర్ చెప్పాడు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. 'హీరోగా మాత్రమే చేయాలని నేను ఫిక్స్ కాలేదు. నేను ఎలాంటి పాత్రలు చేస్తే బాగుంటుందనేది దర్శక నిర్మాతలకి తెలుసు. అలాంటి పాత్రలను చేస్తూనే వుంటాను .. అవకాశం వచ్చినప్పుడు మాత్రం హీరోగా కనిపిస్తాను .. అంతే' అంటూ చెప్పుకొచ్చాడు. 

shakalaka shankar
  • Loading...

More Telugu News