Pawan Kalyan: ఒక దేశానికి ఒక నది చాలదు .. ఒక దేహానికి ఒక రక్తనాళం చాలదు: పవన్ కల్యాణ్
- కవి శేషేంద్ర చెప్పినట్లుగా.. అంటూ పవన్ ట్వీట్
- లోటుపాట్లను ఎలా సవరించవచ్చో చెప్పిన పవన్
- దేశం కోసం కొందరు రాజకీయ నాయకులు సర్వస్వం ధారపోశారు
- వారి భావ ప్రవాహాల్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి
రేపటి నుంచి విశాఖపట్నం జిల్లాలో తిరిగి పాదయాత్ర చేయడానికి సిద్ధమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. 'ఒక దేశానికి ఒక నది చాలదు.. ఒక దేహానికి ఒక రక్తనాళం చాలదు' అని మహాకవి శేషేంద్ర చెప్పినట్లుగా.. అంటూ "వివిధ సామాజిక తత్వవేత్తల ఆలోచన సరళి, దేశం కోసం సర్వస్వం ధారపోసిన గతకాలపు రాజకీయ నాయకుల భావ ప్రవాహాల్ని సమగ్రంగా అర్థం చేసుకోగలిగితేనే మన దేశాన్ని శాసించే స్వార్థ రాజకీయ వ్యవస్థలోని లోటుపాట్లను సవరించగలం" అని పవన్ పేర్కొన్నారు. అలాగే... మతాన్ని, మార్క్సిజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహనీయుడు మహాకవి, పండితుడు 'శ్రీ గుంటూరు శేషేంద్ర' అని పవన్ ట్వీట్ చేశారు.