india: పసికూనపై టీమిండియా పంజా విసురుతుందా?.. తొలి టీ20 నేడే!

  • ఐర్లండ్ తో తొలి టీ20 నేడే
  • రాత్రి 8.30కు మ్యాచ్ ప్రారంభం
  • బ్యాటింగ్ కు అనుకూలించనున్న పిచ్

టీమిండియా సుదీర్ఘ పర్యటన నేటితో ప్రారంభం కాబోతోంది. ఐర్లండ్ తో రెండు టీ20ల సిరీస్ నేటితో ప్రారంభం కానుంది. డబ్లిన్ ఈ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు టీ20ల తర్వాత ఇంగ్లండ్ తో సిరీస్ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా... మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టులు ఆడబోతోంది. మంచి ఫామ్ మీద ఉన్న ఇంగ్లండ్ ను ఢీకొనేందుకు ఐర్లండ్ తో జరగనున్న టీ20లను చిన్నపాటి సన్నాహకంగా టీమిండియా భావిస్తోంది.
 
ఈరోజు జరిగే టీ20లో టీమిండియా తుది జట్టులో.... రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సురేష్ రైనా లేదా కేఎల్ రాహుల్ లేదా మనీష్ పాండే (ఈ ముగ్గురిలో ఒకరు), ధోనీ (కీపర్), దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చాహల్ లేదా ఉమేష్ యాదవ్ (ఈ ఇద్దరిలో ఒకరు), బుమ్రాలు ఉండే అవకాశం ఉంది. ఇక పిచ్ విషయానికి వస్తే... బ్యాటింగ్ కు అనుకూలించే పరిస్థితులు ఉన్నాయి.

india
team india
ireland
t20
dublin
  • Error fetching data: Network response was not ok

More Telugu News