Galla Jayadev: అమ్మా... నీకు శుభాకాంక్షలు: గల్లా జయదేవ్

  • తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో సభ్యురాలిగా గల్లా అరుణ
  • ఆమె అనుభవం పార్టీకి ఉపకరిస్తుందన్న గల్లా జయదేవ్
  • ఫేస్ బుక్ ఖాతాలో శుభాకాంక్షలు

తన తల్లి గల్లా అరుణను తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో సభ్యురాలిగా నియమించడంపై ఆమె కుమారుడు, ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. ఎన్నికల రాజకీయాల నుంచి 30 ఏళ్ల తర్వాత విశ్రాంతి తీసుకున్నంత మాత్రాన.. మొత్తం రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్నట్టు కాదని జయదేవ్ వ్యాఖ్యానించారు. తల్లికి శుభాకాంక్షలు చెబుతూ, మీ అనుభవం, జ్ఞానం, కరుణ, విశ్వసనీయత పార్టీకి, రాష్ట్రానికి, దేశానికి మేలు చేస్తాయన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. కాగా, నిన్న గల్లా అరుణను టీడీపీ పోలిట్ బ్యూరోలోకి ఆహ్వానిస్తూ, ఆమెను సభ్యురాలిగా నియమించిన సంగతి తెలిసిందే.

Galla Jayadev
Galla Aruna
Telugudesam
Polit Bureau
  • Loading...

More Telugu News