bjp: ‘ఎమర్జెన్సీ’ గురించి ప్రస్తావించిన బీజేపీకి కాంగ్రెస్ ఘాటు కౌంటర్
- ఎమర్జెన్సీ విధించినందుకు ఇందిర ఆనాడే క్షమాపణలు చెప్పారు
- నాలుగేళ్లుగా దేశంలో ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ని బీజేపీ విధించింది
- ఇప్పుడు క్షమాపణలు చెప్పేందుకు బీజేపీ సిద్ధమా?
నాడు కాంగ్రెస్ హయాంలో విధించిన ఎమర్జెన్సీ గురించి బీజేపీ ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి కాంగ్రెస్ ఘాటు కౌంటరిచ్చింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి రాజకీయ సలహాదారైన అహ్మద్ పటేల్ స్పందిస్తూ.. ఎమర్జెన్సీ విధించినందుకు ఇందిరాగాంధీ ఆనాడే క్షమాపణలు చెప్పి, తన తప్పు సరిచేసుకున్నారని అన్నారు.
నాలుగేళ్లుగా దేశంలో ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ విధించిన బీజేపీ ఇప్పుడు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. అమాయకులను కొట్టి చంపుతున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం బీజేపీని వెంటాడుతోందని, అందుకే, 1975 నాటి ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించి లబ్ధి పొందాలని చూస్తోందని అన్నారు.