Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ!

  • టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చ
  • 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని యోచిస్తున్నాం
  • త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం
  • వివరించిన ఏపీ మంత్రి కళా వెంకట్రావు

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్నామని మంత్రి కళా వెంకట్రావు అన్నారు. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఉద్యోగాల భర్తీ అంశం చర్చకొచ్చిందని తెలిపారు. మొత్తం 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని యోచిస్తున్నామని, త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పారు. కాగా, ఈ నెల 28 నుంచి ఏరువాక కార్యక్రమం ఉంటుందని సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పాల్గొంటారని అన్నారు. వడ్డెర్లు, రజకులు, మత్స్యకారులను ఎస్సీలో చేర్చే అంశంపై కమిషన్ వేస్తామని, రెండు రోజుల్లో కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించిన జీవో ఇస్తామని చెప్పారు.

Andhra Pradesh
jobs
kala venkatrao
  • Loading...

More Telugu News