women: మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశంగా తేల్చిన అంతర్జాతీయ సర్వే

  • అత్యాచారం, హింస, ఆడ శిశువుల హత్యలు ఇప్పటికీ భారత్ లో ఎక్కువే
  • ఢిల్లీ నిర్భయ అత్యాచారం తర్వాత కూడా తగినన్ని చర్యల్లేవు
  • లైంగిక హింస పరంగా మహిళలకు ప్రమాదకర దేశాల్లో అమెరికాకూ చోటు

మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశమని రాయిటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన అంతర్జాతీయ సర్వే తేల్చి చెప్పింది. మహిళలపై లైంగిక హింసకు తోడు వారిని బానిస కార్మికులుగా మార్చే పరిస్థితులు భారత్ లో ఉన్నాయని పేర్కొంది. మహిళల అంశాలపై నిపుణులైన 550 మంది ఈ సర్వేలో తమ అభిప్రాయాలను తెలియజేశారు. మహిళలకు ప్రమాదకర దేశాలుగా అఫ్ఘానిస్తాన్, సిరియా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. సోమాలియా, సౌదీ అరేబియా తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

ఇక లైంగిక హింస పరంగా పాశ్చాత్య దేశాల్లో అమెరికా ఒక్కటే టాప్ 10లో నిలిచింది. సిరియాతో కలసి మూడో స్థానంలో ఉంది. ఢిల్లీలో ఓ విద్యార్థినిపై బస్సులో జరిగిన అత్యంత పాశవిక దాడి తర్వాత ఐదేళ్ల కాలంలో మహిళల భద్రతకు ప్రభుత్వం అవసరమైనన్ని చర్యలు తీసుకోలేదని సర్వే తేల్చి చెప్పింది. అత్యాచారం, వైవాహిక అత్యాచారం, లైంగిక దాడి, హింస, ఆడ శిశువుల హత్య ఇప్పటికీ భారత్ లో పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయని పేర్కొంది. 

  • Loading...

More Telugu News