Renu Desai: ఇక సహజీవనం వద్దనుకునే సంప్రదాయబద్దంగా పెళ్లి: రేణూ దేశాయ్

  • జీవితంలో ప్రేమ ఒకసారే పుడుతుంది
  • ఇప్పుడు చేసుకునే పెళ్లి ప్రేమ వివాహం కాదు
  • సన్నిహితులు కుదిర్చిన సంబంధమన్న రేణు

అతి త్వరలో ఓ వ్యక్తిని వివాహం చేసుకోనున్న రేణూ దేశాయ్, ఓ ఆంగ్ల పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, తన వివాహం గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనది ప్రేమ వివాహం కాదని, అతన్ని తాను ప్రేమించి పెళ్లాడటం లేదని రేణు వ్యాఖ్యానించారు. తనది సన్నిహితులు కుదిర్చిన వివాహమని తెలిపారు.

జీవితంలో ఒక్కసారే ప్రేమలో పడటం జరుగుతుందని, ప్రేమ ఒక్కసారే పుడుతుందని చెప్పిన రేణు, గత ఏడేళ్లుగా ఒంటరి జీవితాన్ని గడిపిన తాను, ఇప్పుడు సంతోషంగా ఉన్నానని వెల్లడించారు. పెళ్లిపై తనకు ఆత్రుత ఎంతమాత్రమూ లేదని చెప్పారు. అతను చాలా ప్రశాంతంగా ఉంటారని కాబోయే భర్తపై పశంసలు కురిపించిన రేణూ దేశాయ్, మళ్లీ సహజీవనం చేయాలని అనుకోవడం లేదని, అందుకే సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని అన్నారు.

Renu Desai
Marriage
Interview
Love
  • Loading...

More Telugu News