Pawan Kalyan: రేణు గారూ... నా హృదయపూర్వక శుభాకాంక్షలు!: పవన్ కల్యాణ్

  • ఇటీవలే జరిగిన రేణూ దేశాయ్ నిశ్చితార్థం
  • ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా
  • అభినందనలు చెబుతూ పవన్ కల్యాణ్ ట్వీట్ 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకున్న ఎన్నో సంవత్సరాల తరువాత మరో పెళ్లికి సిద్ధపడ్డ రేణూ దేశాయ్ కి పవన్ కల్యాణ్ విషెస్ తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. జీవితంలో సరికొత్త సంతోషాన్ని ఆస్వాదించేందుకు అడుగులు వేస్తున్న ఆమెకు శుభాకాంక్షలని అన్నారు.

"మిస్ రేణు గారు... సంతోషం కోసం కొత్త దశలోకి ప్రవేశిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీకు శాంతి, శ్రేయస్సు కలగాలని నేను భగవంతుడిని, ప్రకృతీమాతను కోరుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా, రేణూ దేశాయ్ నిశ్చితార్థం ఇటీవల ఓ వ్యక్తితో జరుగగా, ఆయన ఎవరన్న విషయం ఇంకా బయటకు రాలేదు.

Pawan Kalyan
Renu Desai
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News