prabhas: రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ .. 1970 నేపథ్యంలో సాగే ప్రేమకథ!

  • రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రేమకథా చిత్రం 
  • ప్రభాస్ సరసన పూజా హెగ్డే 
  • ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్    

ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. మరో నెల రోజుల పాటు ఈ సినిమా షూటింగు 'అబుదాబి'లో జరగనుంది. ఈ సినిమా తరువాత 'జిల్' మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి .. కథా వస్తువు ఏమై వుంటుందనే ఆసక్తి అందరిలోనూ పెరుగుతూ పోతోంది.

1970 నేపథ్యంలో సాగే ఒక ప్రేమకథగా ఈ సినిమా రూపొందనుందనేది తాజా సమాచారం. ప్రస్తుతం ఆ కాలానికి సంబంధించిన సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్స్ ను కళాదర్శకుడు రవీందర్ తీర్చిదిద్దుతున్నారట. లవ్ .. యాక్షన్ .. ఫాంటసీ కలగలిసిన ఈ సినిమా చిత్రీకరణ కొంతభాగం యూరప్ లో జరగనున్నట్టు సమాచారం. పూజా హెగ్డే కథానాయికగా నటించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆగస్టులో మొదలుపెట్టనున్నట్టుగా చెబుతున్నారు.     

  • Loading...

More Telugu News