CM Ramesh: గాలితో కలిసి బీజేపీ, వైసీపీలు డ్రామాలు ఆడుతున్నాయి: అమర్ నాథ్ రెడ్డి

  • జిల్లాలో పెట్డుబడులు పెట్టేందుకు ఎన్నో సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్న ఆది
  • గాలి కోసమే ప్లాంట్ ఇవ్వడం లేదన్న అమరనాథ్ రెడ్డి
  • ఆరో రోజుకు చేరిన సీఎం రమేష్ దీక్ష

కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలనే అంశం విభజన చట్టంలో ఉందని మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు. అయితే, బీజేపీ, వైసీపీలు ఈ విషయంలో డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. కడప జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో సంస్థలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

మరో మంత్రి అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేపట్టినప్పటికీ... కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. గాలి జనార్దన్ రెడ్డి కోసమే స్టీల్ ప్లాంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. మరోవైపు, సీఎం రమేష్ దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. దీంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది.

CM Ramesh
amarnath reddy
adinarayana reddy
steel plant
kadapa
  • Loading...

More Telugu News