tpcc president: ముందస్తు ఎన్నికలకు మేం సిద్ధం... కేసీఆర్ ను సాగనంపుతాం: ఉత్తమ్

  • కేసీఆర్ ను ముందుగా వదిలించుకోవచ్చు
  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపుతాం
  • ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పూర్తి సన్నద్ధంగా ఉంది

ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ కు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనని ప్రకటించారు. ‘‘ఎన్నికలు 2019 మేలో అయినా కానీ, లేదా 2018 డిసెంబర్ లో అయినా సరే... అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడడానికి భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ విభాగం పూర్తి సన్నద్ధంగా ఉంది’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు.

ముందస్తు ఎన్నికలు తెలంగాణ ప్రజలకు శుభవార్తగా ఉత్తమ్ అభివర్ణించారు. ఎందుకంటే కొన్ని నెలల ముందే కేసీఆర్ ను వదిలించుకోవచ్చని వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కాంగ్రెస్ నేతల్ని దద్దమ్మలని అభివర్ణిస్తూ, ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మరి విపక్షాల సంగతేంటి, ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. 

tpcc president
Uttam Kumar Reddy
congress
kcr
early elections
  • Loading...

More Telugu News