Hyderabad: హోరాహోరీగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు... విజేతల వివరాలు!

  • ఉత్కంఠగా సాగిన ఎన్నికలు
  • అధ్యక్షుడిగా విజయ్ కుమార్ రెడ్డి విజయం
  • ప్రధాన కార్యదర్శిగా గెలిచిన రాజమౌళి చారి

హైదరాబాద్ లోని ప్రతిష్ఠాత్మక 'హైదరాబాద్ ప్రెస్ క్లబ్' ఎన్నికలు ఉత్కంఠగా సాగాయి. ఆదివారం నాడు పోలింగ్ జరుగగా, మొత్తం 1,313 మంది సభ్యులకుగాను, 1,100 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రెసిడెంట్ గా పోటీపడిన విజయ్ కుమార్ రెడ్డి 643 ఓట్లు సాధించి విజయం సాధించగా, ఆయన సమీప ప్రత్యర్థి బలరాంకు 254, షరీఫ్ కు 160 ఓట్లు లభించాయి.

ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన మాజీ అధ్యక్షుడు రాజమౌళి చారి 349 ఓట్లు సాధించి గెలిచారు. వైస్ ప్రెసిడెంట్ లుగా ఎల్ వేణుగోపాల్ నాయుడు, రెహానా బేగం (ఉమెన్స్ కోటా) విజయం సాధించగా, ట్రెజరర్ గా సూరజ్ వీ భరద్వాజ్ గెలిచారు. జాయింట్ సెక్రటరీలుగా సీహెచ్ హరిప్రసాద్, కంబాలపల్లి కృష్ణ గెలువగా, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా అనిల్ కుమార్, అమిత్ భట్టు, వి.యశోద, కస్తూరి శ్రీనివాస్, జి.వసంత కుమార్, సీహెచ్ గణేష్, భూపాల్ రెడ్డి, రజనీకాంత్ గౌడ్, కట్టా కవిత, ఉమాదేవి గెలిచారు.

Hyderabad
Press Club
Elections
  • Loading...

More Telugu News