komati reddy: కేసీఆర్ కు సవాల్ విసిరిన కోమటిరెడ్డి

  • కేసీఆర్ కు దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలి
  • అవసరమైతే, ఢిల్లీ వెళ్లి మా అధిష్ఠానాన్ని ఒప్పిస్తాం
  • ఈ విషయమై రాహుల్ కు లేఖ రాస్తాం

దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై  కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అవసరమైతే, రేపు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కూడా ఒప్పిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ కు లేఖ రాయడంతో పాటు, టీ-కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్, సీనియర్ నేత జానారెడ్డితో కూడా చర్చిస్తామని చెప్పారు. కేసీఆర్ కేబినెట్ లో బీసీలకు ఎంత వరకు న్యాయం చేశారని ప్రశ్నించారు.  

komati reddy
kcr
  • Loading...

More Telugu News