rajanikanth: నా సమాధానం విని రజనీకాంత్ ఓ చిరునవ్వు నవ్వి వెళ్లిపోయారు!: నటి ఈశ్వరీరావు

  • కాలా షూటింగ్ చివరి రోజున రజనీ నన్ను ఓ ప్రశ్న అడిగారు
  • ‘నాతో వర్క్ చేసిన ఎక్స్ పీరియన్స్’ ఎలా ఉందన్నారు
  • ఓ అగ్రనటుడు అలా అడుగుతారని ఊహించలేదు

ఇటీవల విడుదలైన ‘కాలా’ చిత్రంలో రజనీకాంత్ సరసన నటించిన ఈశ్వరీరావు ..రజనీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ చివరి రోజున ‘నాతో వర్క్ చేసిన ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది?’ అని రజనీ తనను అడగడాన్ని ఊహించలేకపోయిన తాను.. ‘సార్, మీలాంటి హీరోలు పది మంది ఉంటే సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పగా ఉంటుందని’ సమాధానమిచ్చానని చెప్పారు.

ఇందుకు రజనీ బదులివ్వకుండా ఓ చిరునవ్వు నవ్వి వెళ్లి పోయారని, ఆయన అనుభవమంతా ఆ నవ్వులోనే ఉన్నట్టు అనిపించిందని ఈశ్వరీరావు చెప్పుకొచ్చారు. ఒక నటుడు తన తొలి చిత్రం, తొలి సీన్ లో ఎంత జాగ్రత్తగా, బుద్ధిగా అందరి మాటా వింటూ నేర్చుకుంటాడో, రజనీ కూడా అలా ప్రవర్తించేవారని, అందరితో కలిసిపోతారని అన్నారు. 

rajanikanth
kala
eeswari rao
  • Loading...

More Telugu News