anith shah: అందుకే, మేము జమ్ముకశ్మీర్‌లో పీడీపీతో బంధం తెంచుకున్నాం: స్పష్టతనిచ్చిన అమిత్ షా
- జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా పర్యటన
- మెహబూబా ముఫ్తీపై ఆరోపణలు
- హిందూవులు అత్యధికంగా ఉన్న ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు
జమ్ముకశ్మీర్‌లో పీడీపీతో బీజేపీ బంధం తెంచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఆ రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై ఆరోపణలు చేశారు. ఆమె పాలనలో హిందువులు అత్యధికంగా ఉన్న జమ్మూ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. అంతేగాక, కశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్ర సర్కారు రాష్ట్రానికి 80 వేల కోట్ల రూపాయలు ఇవ్వగా, ఆ డబ్బు జమ్మూ, లడఖ్‌లకు చేరలేదని పేర్కొన్నారు.
దీంతో ఆ రెండు ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయని, అభివృద్ధిలో సమన్యాయం లేకపోవడం వల్లే తాము పీడీపీతో బంధం తెంచుకున్నామని అమిత్ షా చెప్పారు. తమ పార్టీ అధికారం కోసం పాకులాడదని, తాము అభివృద్ధిని మాత్రమే కోరుకుంటామని చెప్పుకొచ్చారు.