subhalekha sudhakar: ఒకానొక సమయంలో శైలజకి నేను ఒక పూట భోజనం పెట్టడమే కష్టమైపోయింది: శుభలేఖ సుధాకర్

  • బాలూ గారు నన్ను గమనిస్తూ వచ్చారట 
  • ఆ విషయం నాకు ఎంతమాత్రం తెలియదు 
  • బాలూగారి సాయం ఎప్పుడూ కోరలేదు

నటుడిగా సుదీర్ఘ కాలంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తోన్న శుభలేఖ సుధాకర్, ప్రేక్షకుల మనస్సులో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి శుభలేఖ సుధాకర్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులను గురించి ప్రస్తావించారు. "శైలజను నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్న బాలూ గారూ అయిదేళ్ల నుంచి నన్ను గమనిస్తూ వచ్చారట. శైలజతో పెళ్లి అయ్యేంతవరకూ నాకు ఈ విషయమే తెలియదు.

'నా జీవితంలో నువ్వు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇదే అన్నయ్యా' అంటూ నన్ను చూపిస్తూ బాలూగారితో శైలజ అనడం నేను ఎప్పటికీ మరిచిపోలేను. "మా అబ్బాయి పెద్దగా సంపాదించలేదు గానీ .. మీ అమ్మాయికి రెండు పూటలా భోజనం పెట్టగలడు" అని బాలూ గారితో మా నాన్నగారు అన్నారు. కానీ ఒకానొక సమయంలో శైలజకి నేను ఒక పూట భోజనం పెట్టడమే కష్టమైపోయింది. ఒక పూట భోజనం చేయలేకపోతే బతకలేమా అనేది నా ఉద్దేశం .. అందుకే బాలూగారి సాయం ఎప్పుడూ కోరలేదు. సినిమాల్లో అవకాశాల కోసం కూడా ఆయన సహకారాన్ని ఎప్పుడూ తీసుకోలేదు" అని చెప్పుకొచ్చారు.  

subhalekha sudhakar
sailaja
  • Loading...

More Telugu News