subhalekha sudhakar: నాకు ఆస్తిపాస్తులు లేవు ..అందమైన పర్సనాలిటీ లేదు!: శుభలేఖ సుధాకర్

  • పది సినిమాలకి సైన్ చేశా 
  • పది అవకాశాలూ చేజారిపోయాయి 
  • కారణమేమిటనేది అర్థం కాలేదు

శుభలేఖ సుధాకర్ వివిధ సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ .. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ధారావాహికల్లోను విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన కొన్ని విషయాలను గురించి ప్రస్తావించారు. "వరుస అవకాశాలతో బిజీగా వున్నప్పుడు కూడా నేను హీరోగా ట్రై చేయలేదు .. అందుకు కారణం నాకు ఆస్తిపాస్తులు లేవు .. అందమైన పర్సనాలిటీ లేదు.

ఇక కేరక్టర్ ఆర్టిస్ట్ వేషాల విషయానికే వస్తే .. పెళ్లికి ముందే పది సినిమాలకి సంతకాలు చేశా .. పెళ్లి అయిన తరువాత అంటే పది రోజుల గ్యాప్ లోనే ఆ పది సినిమాల్లోని అవకాశాలు చేజారి పోయాయి. అందుకు కారణం ఏమిటనేది నాకు అర్థం కాలేదు. అలా అనుకోకుండా నా కెరియర్ కి ఒక ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత మద్రాసు వదిలి రాకపోవడం వల్లనే నాకు అవకాశాలు రాకుండాపోయాయనే విషయాన్ని నేను ఒప్పుకోను" అని ఆయన చెప్పుకొచ్చారు.  

subhalekha sudhakar
  • Loading...

More Telugu News