Pawan Kalyan: పవన్ కల్యాణ్ వద్దకు అకీరా రావడంపై.. రేణు దేశాయ్ స్పందన

  • తండ్రితో సెలవులు గడపడానికే అకీరా వచ్చాడు
  • హైదరాబాదుకు షిఫ్ట్ కాలేదు
  • నిన్నటి నుంచి నాకు ఎన్నో మెసేజ్ లు వస్తున్నాయి
  • వాటికి సమాధానంగానే ఈ క్లారిటీ ఇస్తున్నా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో అద్దె ఇంట్లోకి దిగిన సంగతి తెలిసిందే. భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరాలతో కలసి ఆయన శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. ఈ క్రమంలో తండ్రి వద్దకు కుమారుడు వచ్చిన విషయంపై పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించారు.

"స్కూలు సెలవులను గడపడానికే తండ్రి వద్దకు అకీరా వచ్చాడు. అకీరా హైదరాబాదుకు షిఫ్ట్ కాలేదు. పవన్ తో కలసి అకీరా కనిపించడంతో... నిన్నటి నుంచి నాకు వరుసగా మెసేజ్ లు వస్తున్నాయి. ఆ మెసేజ్ లకు సమాధానంగానే నేను ఈ క్లారిటీ ఇస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు.

Pawan Kalyan
renu desai
akira
  • Loading...

More Telugu News