amala paul: నా మొదటి ప్రేమికుడు హీరో మాధవన్: అమలాపాల్

  • నాక్కూడా తొలి ప్రేమ ఉంది
  • నా తొలి ప్రేమికుడు మాధవన్
  • ఆయనంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం

కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు విజయ్ తో ప్రేమలో మునిగి తేలి, ఆ తర్వాత ఆయనను నటి అమలాపాల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, మనస్పర్థల నేపథ్యంలో, అతని నుంచి అంతే వేగంగా ఆమె విడిపోయింది. ప్రస్తుతం సినిమాలతోనే ఆమె బిజీగా ఉంది.

తాజాగా ప్రేమ గురించి ఆమె మాట్లాడుతూ, తనకు కూడా తొలి ప్రేమ ఉందని తెలిపింది. తన మొదటి ప్రేమికుడు మరెవరో కాదని... హీరో మాధవన్ అని చెప్పింది. చిన్నప్పటి నుంచి తనకు మాధవన్ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆమె పక్కనే మాధవన్ కూడా ఉన్నాడు. అమలాపాల్ చెప్పిన మాటలు విన్న మాధవన్... చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోయాడు. అమలాపాల్ మాత్రం లేచి, అతన్ని హగ్ చేసుకుంది. 

amala paul
first crush
madhavan
kollywood
tollywood
  • Loading...

More Telugu News