Hyderabad: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను జనానికి వివరిస్తాం: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

  • ఈరోజు నుండి తెలంగాణాలో బస్సు యాత్ర
  • యాదాద్రి ఆలయంలో పూజల అనంతరం బహిరంగసభ
  • 14 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బస్సుయాత్ర నిర్వహించేందుకు రెడీ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను జనానికి వివరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం చేరుకుంటారు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత భువనగిరిలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగసభ జరగనుంది. ఈరోజు నుండి 14 రోజుల పాటు జరిగే ఈ యాత్ర జులై  6న ముగుస్తుంది.

Hyderabad
Hyderabad District
BJP
Telangana
  • Loading...

More Telugu News