Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ మద్దతిస్తే ఇవ్వనివ్వండి.. మేము మాత్రం పొత్తు పెట్టుకోం!: వైసీపీ నేత ఉమ్మారెడ్డి

  • వరప్రసాద్‌ వ్యాఖ్యలపై స్పందన
  • ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది
  • పవన్‌ పోటీ చేయకుండా ఇతరులకి మద్దతు ఇవ్వచ్చు

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తమకు మద్దతు తెలిపినా, తెలపకున్నా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పవన్ తమకు మద్దతు తెలుపుతారని వైసీపీ నేత వరప్రసాద్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఆయన వ్యాఖ్యలపై స్పందించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ... "ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.. ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోదు.. పవన్ మద్దతిస్తాడేమో.. ఆయన పోటీ చేయకుండా మద్దతు ఇవ్వచ్చు.. ఇస్తే ఇవ్వనివ్వండి. ఆయన మద్దతిచ్చినా మేము మాత్రం పొత్తు పెట్టుకోకుండానే పోటీ చేస్తాం" అని వ్యాఖ్యానించారు. కాగా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తమ ఎంపీలు రాజీనామా చేశారని, వారిని కూడా కొందరు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.

Pawan Kalyan
ummareddy
YSRCP
  • Loading...

More Telugu News