ramana dikshitulu: రమణదీక్షితులు ఆమరణ దీక్ష చేస్తే అడ్డుకుంటాం: భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి

  • రాజకీయ, వ్యక్తిగత కారణాలతోనే రమణదీక్షితుల ఆరోపణలు  
  • తిరుమల శ్రీవారి నగలు ఏమీ అదృశ్యం అవలేదు
  • లక్షల మందితో ఈ దీక్షను అడ్డుకుంటాం

టీటీడీ మాజీ ప్రధాన  అర్చకుడు రమణ దీక్షితులుపై రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ (భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి ) మండిపడ్డారు. సినీ నిర్మాత, పీఆర్పీ మాజీ నేత, ఎన్వీ ప్రసాద్ తో కలిసి ఈరోజు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి నగలు ఏమీ అదృశ్యం అవలేదని ఎన్నో కమిటీలు తేల్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం రాజకీయ, వ్యక్తిగత కారణాలతోనే రమణదీక్షితులు టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల వ్యవహారంపై రమణదీక్షితులు ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించడంపై వారు స్పందిస్తూ, లక్షల మందితో ఆ దీక్షను అడ్డుకుంటామని హెచ్చరించారు.

కాగా, వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడు భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి. ‘భూమన్’ పేరుతో రచయితగా పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ అధ్యయనాల సంస్థను ఆయన నిర్వహిస్తున్నారు. టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్న సమయంలో.. టీటీడీకే చెందిన శ్వేత సంస్థకు డైరెక్టర్ గా సుబ్రహ్మణ్యంరెడ్డి వ్యవహరించారు.

ramana dikshitulu
bhumana subramanyam
  • Loading...

More Telugu News