lalu prasad yadav: లాలూను జైలుకు పంపిన జడ్జి ఇంట్లో దొంగతనం!

  • ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ గ్రామంలో దొంగతనం
  • నిన్న రాత్రి చోరీ.. ఉదయం గుర్తించిన ఆయన సోదరుడు
  • రూ. 60 వేల నగదు, రూ. 2 లక్షల విలువైన నగల చోరీ

దాణా కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లూలూ ప్రసాద్ యాదవ్ ను జైలుకు పంపిన సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి శివ్ పాల్ సింగ్ నివాసంలో చోరీ జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ గ్రామంలో ఉన్న శివ్ పాల్ నివాసంలో చోరీ చేసిన దొంగలు... రూ. 60 వేల నగదుతో పాటు రూ. 2 లక్షలు విలువ చేసే నగలను ఎత్తుకెళ్లారు. నిన్న రాత్రి ఈ దొంగతనం జరగింది. శివ్ పాల్ సోదరుడు సురేంద్ర సింగ్ మాట్లాడుతూ, చోరీ జరిగిన విషయాన్ని ఈ ఉదయం గుర్తించామని తెలిపారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

lalu prasad yadav
cbi judge
shivpal singh
robbery
  • Loading...

More Telugu News