adhurs: తెలుగు 'బిగ్‌బాస్‌-2'ను విజయవంతంగా నడిపిస్తోన్న నాని.. రేటింగ్స్‌ అదుర్స్‌!

  • ఈనెల 10న ప్రారంభమైన బిగ్‌బాస్‌
  • టీఆర్‌పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో నాని షో
  • ఆసక్తిని రేపుతోన్న నేచురల్‌ స్టార్‌

ఈనెల 10న బిగ్‌బాస్‌ సీజన్‌ 2ని ప్రారంభించిన నేచురల్ స్టార్‌ నాని అదరగొట్టేస్తున్నాడు. 'ఏదైనా జరగొచ్చు రెడీగా ఉండడంటూ' ఆసక్తి రేపిన నాని బిగ్‌బాస్‌-2ను సక్సెస్‌ దిశగా నడిపిస్తున్నాడు. మొదట బిగ్‌బాస్‌ పట్ల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ షోను చాలా మంది చూస్తున్నట్టు తేలింది.

తొలి వారం ఈ కార్య‌క్ర‌మం అత్యధికంగా టీఆర్‌పీ రేటింగ్స్‌ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ షో ప్రతి శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ, శుక్ర వారాల్లో రాత్రి 9.30 గంటలకు స్టార్‌ మాటీవీలో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. బీఏఆర్సీ గణాంకాల ప్ర‌కారం సీజ‌న్ 2 లాంచింగ్ ఎపిసోడ్‌కి టీఆర్పీ రేటింగ్‌ 15.05 వచ్చింది. వీక్ డేస్‌లో 7.93గా న‌మోదు అయింది. సీజన్‌-1లో జూ.ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్నప్పుడు మొదటి వారంలో వచ్చిన రేటింగ్స్‌కు ఇది కాస్త తక్కువే అయినప్పటికీ, ఈ షో పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని తగ్గకుండా చేశాడు నేచురల్‌ స్టార్‌ నాని.    

  • Loading...

More Telugu News