manisha koirala: ఇందిరాగాంధీ బయోపిక్‌లో నటించాలని ఉంది... మనీషా కొయిరాలా

  • బాలీవుడ్లో బయోపిక్ ల జోరు
  • భారీస్థాయిలో రాబడుతోన్న వసూళ్లు
  • మనీషా కొయిరాలా మనసులో మాట

ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. వివిధ రంగాలకి చెందిన ప్రముఖుల జీవితచరిత్రలు ఆసక్తికరమైన కథలుగా మారిపోతున్నాయి. అశేష ప్రేక్షకుల ఆదరణను పొందుతూ అనూహ్యమైన విజయాన్ని సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తనకి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలని ఉందని మనీషా కొయిరాలా అన్నారు.

"అత్యంత శక్తిమంతమైన మహిళగా ఇందిరాగాంధీ కనిపిస్తారు. ఆమె పరిపాలనా కాలంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు .. దేశ ప్రజలను ఆమె ప్రభావితం చేసిన తీరు అపూర్వం. అలాంటి అసాధారణమైన మహిళగా .. ఆదర్శవంతమైన ప్రధానిగా వెండితెరపై కనిపించాలనేది నా చిరకాల కోరిక. 16 యేళ్ల క్రితమే నేను ప్రధాన పాత్రధారిగా ఇందిరాగాంధీ బయోపిక్ కి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయి. ఎన్.చంద్ర దర్శకుడిగా కొంత హోమ్ వర్క్  జరిగింది" అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు. ఇందిరాగాంధీ పాత్రలో మెప్పించాలనే మనీషా ఆశలు నెరవేరతాయేమో చూడాలి.   

manisha koirala
  • Loading...

More Telugu News