vijay devarakonda: 'గీత గోవిందం' నుంచి ప్రీ లుక్ వచ్చేసింది

  • పరశురామ్ దర్శకత్వంలో 'గీత గోవిందం'
  • విజయ్ దేవరకొండ జోడీగా రష్మిక 
  • ఈ నెల 23న ఫస్టులుక్ రిలీజ్

పరశురామ్ దర్శకత్వంలో 'గీత గోవిందం' సినిమా రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. విజయ్ దేవరకొండ .. రష్మిక మందన కథానాయికలుగా నటిస్తున్నారు. ముందుగా చెప్పినట్టుగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. గీత .. గోవింద్ ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు ఎలా ఇంప్రెస్ చేసుకోవాలనే విషయంలో నిమగ్నమై వున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు.

ఈ నెల 23వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నామనే విషయాన్ని కూడా ఈ పోస్టర్ ద్వారానే తెలియజేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గీత .. గోవింద్ అంటూ విజయ్ దేవరకొండ .. రష్మిక ఒకరికి ఒకరు చేసిన ఫన్నీ ట్వీట్స్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News