Ganta Srinivasa Rao: సమయం చూసి చంద్రబాబుకు అన్ని విషయాలూ చెబుతా!: గంటా శ్రీనివాస్

  • నాపై అసంతృప్తి లేదు
  • చంద్రబాబుకు విషయం చెబుతా
  • అలక వీడిన తరువాత మంత్రి గంటా

తన సొంత నియోజకవర్గంలోని ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నారని వచ్చిన వార్తలతో మనస్తాపానికి గురై, గత నాలుగు రోజులుగా ముభావంగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాస్, చంద్రబాబు సహా పలువురు నేతల బుజ్జగింపులతో మెత్తబడి, విశాఖపట్నానికి వస్తున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, తనపై ప్రజా వ్యతిరేకత ఉందన్న వార్తలు అవాస్తవమని అన్నారు.

తాను తిరిగి భీమిలి నుంచే పోటీ చేస్తానని, గెలుస్తానన్న నమ్మకం ఉందని చెప్పిన ఆయన, తనపై వ్యతిరేకత లేదని చంద్రబాబుకు స్పష్టం చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. మధ్యాహ్నం చంద్రబాబు పాల్గొనే కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని, సమయం చూసి ఆయనకు అన్ని విషయాలూ చెబుతానని అన్నారు. భీమిలిలో ఆయనపై వ్యతిరేకత ఉందని లగడపాటి టీమ్ నిర్వహించిన సర్వేలో తేలినట్టు వార్తలు రావడంతో, ప్రభుత్వ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

Ganta Srinivasa Rao
Bhimili
Chandrababu
Vizag
  • Loading...

More Telugu News