Burger King: "సాకర్ ప్లేయర్లతో పిల్లల్ని కంటే జీవితాంతం వూపర్స్ ఫ్రీ"... ప్రకటించి 'సారీ' చెప్పిన బర్గర్ కింగ్!

  • ప్రస్తుతం రష్యాలో ఫుట్ బాల్ వరల్డ్ కప్
  • రష్యా ఫుట్ బాల్ భవిష్యత్తు బాగుండాలంటూ వివాదాస్పద ప్రకటన
  • విదేశీ ఆటగాళ్లతో పిల్లల్ని కంటే ఉచిత వూపర్స్ అంటూ వ్యాఖ్య
  • విమర్శలు వెల్లువెత్తడంతో మన్నించాలని వేడుకోలు

ప్రస్తుతం రష్యాలో వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీలు ఉత్సాహంగా, ఉత్కంఠగా సాగుతుండగా, వివిధ దేశాల నుంచి వచ్చే ఫుట్ బాల్ ఆటగాళ్లతో సెక్స్ చేసి, వారి బిడ్డలకు తల్లిగా మారితే జీవితాంతం వూపర్స్ ఉచితంగా ఇస్తామని ప్రకటించిన 'బర్గర్ కింగ్' ఆపై వచ్చిన విమర్శలతో క్షమించాలని కోరింది.

ప్రపంచకప్‌ ఫుట్‌ బాల్‌ ఆటగాళ్ల ద్వారా గర్భం దాల్చి పిల్లలను కనే రష్యా మహిళలకు ఇది తమ ఆఫరని, జీవితాంతం వూపర్స్‌ ఉచితంగా ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పించిన బర్గర్‌ కింగ్‌ పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. రష్యా ఫుట్ బాల్ భవిష్యత్తును మరింత మెరుగ్గా చేసేందుకు సహకరించే మహిళలకు తమ ఆఫర్ వర్తిస్తుందని ఆ సంస్థ తొలుత ప్రకటించింది. ఆపై దాన్ని తొలగిస్తూ, ఇటువంటి ప్రకటన చేసినందుకు మన్నించాలని కోరింది.

Burger King
Russia
Foot Ball
World Cup
Players
S*x
  • Loading...

More Telugu News