Kamal Haasan: రాహుల్, ప్రియాంకలతో గంటకు పైగా కమలహాసన్ భేటీ... రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ!

  • ఢిల్లీలో కలిసిన కమలహాసన్
  • దాదాపు గంటకు పైగా చర్చలు
  • మర్యాదపూర్వక సమావేశమన్న కమల్
  • పొత్తులపై కొత్త చర్చలంటున్న విశ్లేషకులు

తమిళనాట మక్కల్ నీది మయ్యమ్ పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించి, తదుపరి జరిగే ఎన్నికల్లో బరిలోకి దిగుతానని ప్రకటించిన విలక్షణ నటుడు కమలహాసన్, న్యూఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాహుల్ తో పాటు ఆయన సోదరి ప్రియాంక కూడా అక్కడే ఉండటంతో, వీరి మధ్య ఏం మాటలు సాగుంటాయా? అన్న కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దాదాపు గంటకుపైగా ఈ ముగ్గురి భేటీ జరిగినట్టు తెలుస్తోంది.

రాహుల్ తో సమావేశం అనంతరం కమల్ మీడియాతో మాట్లాడుతూ, తమది మర్యాదపూర్వక భేటీయేనని, రాజకీయ అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని తెలిపారు. మక్కల్ నీది మయ్యమ్, కాంగ్రెస్ పార్టీలు కలసి తమిళనాడులో కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఇటీవలి కాలంలో ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరిద్దరూ రాష్ట్రంలో పొత్తులపైనే చర్చించుకుంటారని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Kamal Haasan
Rahul Gandhi
New Delhi
Priyaanka Gandhi
  • Loading...

More Telugu News