Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు అస్వస్థత

  • తొమ్మిది రోజుల పాటు ధర్నా నిర్వహించిన కేజ్రీవాల్
  • శరీరంలో పెరిగిన చక్కెర స్థాయులు
  • నడక లేకపోవడం, వేళకు ఆహారం తీసుకోకపోవడమే కారణం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గుయ్యారు. ఐఏఎస్ ల సమ్మెను నిరసిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ కార్యాలయంలో తొమ్మిది రోజుల పాటు ఆయన ధర్నా నిర్వహించన సంగతి తెలిసిందే. అయితే, మంగళవారం రాష్ట్ర మంత్రులు నిర్వహించిన సమావేశాలకు ఐఏఎస్ లు హాజరుకావడంతో ఆయన ధర్నా విరమించారు.

అరవింద్ కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్. ఈ తొమ్మిది రోజుల పాటు నడక మానేయడం, వేళకు భోజనం చేయకపోవడంతో ఆయన శరీరంలో చక్కెర స్థాయులు పెరిగాయి. దీంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. పద్ధతి ప్రకారం ఆహార నియమాలు పాటించే కేజ్రీవాల్ కు... ధర్నావల్లే ఆరోగ్యం పాడయిందని ఆయన సన్నిహితులు తెలిపారు.

  • Loading...

More Telugu News