Russia: లైవ్ రిపోర్ట్ ఇస్తుంటే మహిళా జర్నలిస్టును కిస్ చేసి వెళ్లిన యువకుడు... వీడియో చూడండి!

  • రష్యాలో ఫుట్ బాల్ పోటీలను కవర్ చేస్తున్న జర్నలిస్టు
  • వేగంగా వచ్చి ముద్దిచ్చి వెళ్లిన యువకుడు
  • సోషల్ మీడియాలో అతనిపై విమర్శల వెల్లువ

ప్రస్తుతం వరల్డ్ కప్ సాకర్ పోటీలు జరుగుతున్న రష్యాకు వెళ్లిన కొలంబియా మహిళా జర్నలిస్టుకు వింతైన అనుభవం ఎదురైంది. ఓ జర్మన్ న్యూస్ చానల్ లో పనిచేస్తున్న జూలియట్ గోంజాలెజ్ థెరాన్ అనే యువతి, సరన్స్ ప్రాంతంలో నిలబడి లైవ్ రిపోర్టు ఇస్తుండగా, గుర్తు తెలియని ఓ యువకుడు వచ్చి, ఆమె బుగ్గపై ముద్దు పెట్టి వెళ్లాడు. అదే సమయంలో ఆమె గుండెల వద్ద చేత్తో గట్టిగా పట్టుకున్నాడు. ఈ సంఘటనపై అప్పటికప్పుడు ఎలాంటి స్పందనా చూపని జూలియట్, తన లైవ్ కవరేజ్ ని కంటిన్యూ చేసింది. ఆపై జరిగిన ఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది.

తాను లైవ్ రిపోర్టు ఇచ్చే ఉద్దేశంతో అంతకు రెండు గంటల ముందు నుంచి అదే ప్రాంతంలో ఉన్నానని చెప్పింది. లైవ్ ఇస్తున్నప్పుడు వెంటనే రియాక్ట్ కాబోనని తెలుసుకున్న ఆ వ్యక్తి ఈ పని చేసి వెళ్లాడని, ఆపై ఎంత సేపు అతని గురించి వెతికినా కనిపించలేదని చెప్పింది. కాగా, అతను స్థానికుడా? లేక ఫుట్ బాల్ పోటీలు చూసేందుకు రష్యాకు వచ్చిన వేలాది మందిలో ఒకడా? అన్నది తెలియరాలేదు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తి చేసిన పనిని తూర్పారబడుతున్నారు. ఓ మహిళా జర్నలిస్టుకు రక్షణ కల్పించడంలో రష్యా విఫలమైందని ఆరోపిస్తున్నారు.

Russia
Football
World cup
Live Coverage
Kiss
Journalist
  • Loading...

More Telugu News