Narendra Modi: వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రధాని అభ్యర్థి కాదా?.. పక్కకు తప్పించే యోచనలో ఆరెస్సెస్!

  • తగ్గుతున్న మోదీ చరిష్మా
  • ప్రధాని అభ్యర్థిగా మోదీకి మద్దతు లేకుంటే తెరపైకి మరొకరు
  • ప్రత్యామ్నాయం సిద్ధం చేస్తున్న ఆరెస్సెస్

మోదీ హవాతో కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో ఆయనను పక్కన పెట్టేయనుందా? ప్రత్యామ్నాయం కోసం వెతుకుతోందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

2014తో పోలిస్తే ప్రస్తుతం దేశంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) భావిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ మూటముల్లె సర్దుకోవడం ఖాయమని అంచనా వేస్తోంది. ప్రధాని అభ్యర్థిగా మోదీకి మద్దతు లేకపోతే, ఆయన స్థానంలో మరొకరిని తెరపైకి తీసుకురావాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు, ఆయనకు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరం శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిని ఎదుర్కొనే విషయంలోనూ బీజేపీ తీరుపై ఆరెస్సెస్ అసంతృప్తిగా ఉంది. వారం రోజుల క్రితం హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో బీజేపీ, ఆరెస్సెస్ నేతలు సమావేశమయ్యారు. మూడు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఈ విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News