heroine radhika apte: అందుకే, నటించకూడదనుకున్న చిత్రాల్లోనూ నటించా: హీరోయిన్ రాధికా ఆప్టే

  • డబ్బు కోసమే అలాంటి చిత్రాల్లో నటించా
  • సినీ రంగంలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే సులభంగా అవకాశాలొస్తాయి
  • లేకపోతే కష్టాలు తప్పవు 

ఎలాంటి సినిమాల్లో అయితే నటించకూడదని భావించానో, డబ్బు కోసం అలాంటి చిత్రాల్లోనే నటించాల్సి వచ్చిందని హీరోయిన్ రాధికా ఆప్టే చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, జీవనాధారం కోసం అలాంటి చిత్రాల్లో నటించక తప్పలేదని తెలిపింది.

ఇప్పుడు తాను పేరు, డబ్బు సంపాదించుకున్నానని, సినిమాల్లో అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయని చెప్పిన రాధికా ఆప్టే, ప్రస్తుతం అన్ని సినిమాల్లోనూ నటించేందుకు అంగీకరించడం లేదని, కథ నచ్చితేనే ఒప్పుకుంటున్నానని చెప్పింది. సినిమా రంగంలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికే అవకాశాలు సులభంగా లభిస్తాయని, అది లేకపోతే, కష్టాలు తప్పవని పేర్కొంది. తనకు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో మొదట్లో ఇబ్బందులు తప్పలేదని చెప్పుకొచ్చింది.

heroine radhika apte
liveli hood
money
  • Loading...

More Telugu News