saudi arabia: ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ సౌదీ ఫుట్ బాల్ టీమ్

  • రాస్తోవ్ కు వెళ్తుండగా ప్రమాదం
  • గాల్లో ఉండగానే ఇంజిన్ లో మంటలు
  • భయాందోళనలకు గురైన ఆటగాళ్లు

సౌదీ అరేబియా ఫుట్ బాల్ ఆటగాళ్లు పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా వారు ప్రయాణిస్తున్నప్పుడు... విమానంలోని ఓ ఇంజిన్ లో ఆకస్మికంగా మంటలు వచ్చాయి. ఉరుగ్వేతో మ్యాచ్ ఆడేందుకు రాస్తోవ్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే మంటలు వ్యాపించాయి.

దీంతో, ఆటగాళ్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కానీ, చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక లోపం వల్లే ఇంజిన్ లో మంటలు వచ్చాయని తెలుస్తోంది. అయితే పక్షి ఢీకొనడం వల్ల మంటలు చెలరేగాయని రష్యా ఎయిర్ లైన్స్ తెలిపింది. 

saudi arabia
football team
aeroplane
Fire Accident
russia
fifa
  • Loading...

More Telugu News