Sachin Tendulkar: సచిన్ కుమారుడైనంత మాత్రాన.. నాకు స్పెషల్ కాదు!: అండర్-19 కోచ్

  • అండర్-19 జట్టుకు ఎంపికైన అర్జున్ టెండూల్కర్
  • త్వరలో శ్రీలంకతో సిరీస్
  • అందరినీ ఒకేలా చూస్తానన్న బౌలింగ్ కోచ్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ అండర్-19 జట్టులో స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. త్వరలో శ్రీలంకకు వెళ్లనున్న జట్టుకు అర్జున్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి దృష్టి అర్జున్ పైనే ఉంది.

ఈ సందర్భంగా అండర్-19 బౌలింగ్ కోచ్ సనత్ కుమార్ మాట్లాడుతూ, అర్జున్ పట్ల తాను ప్రత్యేక శ్రద్ధను చూపనని...  అందరు ఆటగాళ్ల మాదిరే అతన్ని కూడా చూస్తానని తెలిపాడు. ఒక కోచ్ గా జట్టులోని ఆటగాళ్లంతా తనకు సమానమేనని చెప్పాడు. ప్రతి ఆటగాడు మెరుగైన ప్రదర్శన చేసేలా చూడటమే తన కర్తవ్యమని తెలిపాడు 

Sachin Tendulkar
arjun tendulkar
under 19
  • Loading...

More Telugu News