Singapore: సింగపూర్ సిస్టర్స్ సృష్టి... 'పీరియడ్ ప్యాడ్స్'కు బదులుగా 'ఫ్రీడమ్ కప్'!
- మహిళలకు ఉపయోగపడేలా 'ఫ్రీడమ్ కప్'
- తిరిగి వాడుకునే వీలు
- ఖర్చు తగ్గుతుందంటున్న సింగపూర్ అక్కాచెల్లెళ్లు
మహిళలకు నెలసరి పీరియడ్స్ లో అవసరమయ్యే శానిటరీ ప్యాడ్స్ కు బదులుగా 'ఫ్రీడమ్ కప్' పేరిట సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు సింగపూర్ కు చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు. వెనెసా పెరన్ జ్యోతి, జో అనీ, రెబికా అనే సిస్టర్స్ నేపాల్ లో మహిళలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయి, శానిటరీ ప్యాడ్స్ కు దూరంగా ఉండే మహిళల పరిశుభ్రత కోసం ఏదైనా చేయాలని ఆలోచించారు.
బెల్ ఆకారంలో ఉండే చిన్న కప్ ను తయారు చేశారు. దీన్ని సులువుగా గర్భాశయం కింద అమర్చుకోవచ్చని, వినియోగించిన తరువాత తిరిగి శుభ్రం చేసుకోవచ్చని ఈ సిస్టర్స్ అంటున్నారు. తరచూ ప్యాడ్స్ కోసం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదని చెప్పారు.