Asaduddin Owaisi: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి అసలైన కారణం ఇదే: అసదుద్దీన్ ఒవైసీ

  • ఒక్క ముస్లింకు కూడా టికెట్ ఇవ్వలేదు
  • కర్ణాటక నుంచి ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు
  • ముస్లింల కోసం బీజేపీ ఏమీ చేయడం లేదనే విషయం అర్థమవుతోంది

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి గల కారణమేంటో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివరించారు. ఒక్క ముస్లింకు కూడా బీజేపీ టికెట్ ఇవ్వలేదని... బీజేపీ ఓటమికి ఇదే ప్రధాన కారణమని చెప్పారు. రాష్ట్రం నుంచి బీజేపీ తరపున ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరని ఆయన అన్నారు. ముస్లింల రాజకీయ ఎదుగుదల కోసం, సంక్షేమం కోసం బీజేపీ ఏమీ చేయడం లేదనే విషయం దీంతో అర్థమవుతోందని విమర్శించారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు అందరికీ అర్థమవుతున్నాయని... ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండే వారు బీజేపీకి దూరంగా ఉంటారని చెప్పారు.

Asaduddin Owaisi
karnataka
elections
BJP
defeat
reasons
  • Loading...

More Telugu News