India: నేటి బంగారం, వెండి ధరలు!

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
  • రూ. 30 తగ్గిన పది గ్రాముల బంగారం ధర
  • రూ. 77 తగ్గిన బ్యారల్ క్రూడాయిల్ ధర

అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నుంచి అందుతున్న సంకేతాలు బలహీనంగా ఉన్న వేళ, ఆభరణాల వ్యాపారులు నూతన కొనుగోళ్లకు దూరం జరగడంతో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. క్రితం ముగింపుతో పోలిస్తే బంగారం ధర పది గ్రాములకు రూ. 30 తగ్గి రూ. 30,980 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ. 9 తగ్గి రూ. 40,190 వద్ద కొనసాగుతోంది.

ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారల్ కు రూ. 77 పడిపోయి రూ. 4,538 వద్దకు చేరింది. కాగా, నేటి స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య ప్రారంభంకాగా, నిఫ్టీ 9 పాయింట్లు, సెన్సెక్స్ 22 పాయింట్లు నష్టపోయాయి. ఐటీ కంపెనీలు నష్టాల్లో ట్రేడవుతుండగా, బ్యాంకులు లాభాల బాటన నడుస్తున్నాయి.

India
Gold
Silver
Crude Oil
  • Loading...

More Telugu News