Nizamabad District: మహిళ గుండెలపై కాలితో తన్నిన ఎంపీపీ అరెస్ట్!

  • స్థల విక్రయం సందర్భంగా వివాదం
  • ఎంపీపీని చెప్పుతో కొట్టిన మహిళ
  • ఆగ్రహంతో కాలు చేసుకున్న ఎంపీపీ

ఓ స్థల విక్రయం సందర్భంగా చోటు చేసుకున్న వివాదంలో మహిళను గుండెలపై తన కాలితో బలంగా తన్నిన నిజామాబాద్ జిల్లా దర్పల్లి ఎంపీపీ గోపీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న న్యూస్ చానళ్లలో, సోషల్ మీడియాలో మహిళను తన్నుతున్న దృశ్యాలు వైరల్ కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఉదయం ఆయన్ను అరెస్ట్ చేశారు. ఓ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించిన తరువాత, గోపీ అదనంగా డబ్బులు అడిగారని ఆరోపించిన బాధిత మహిళ, ఆయన్ను చెప్పుతో కొట్టగా, ఆపై తీవ్ర ఆగ్రహంతో గోపీ కాలితో తన్నిన సంగతి తెలిసిందే.

Nizamabad District
Indalvai
MPP
Gopi
Police
Arrest
  • Error fetching data: Network response was not ok

More Telugu News