rashmi: అనసూయ ఫ్యాన్స్ అప్పట్లో నాపై అసభ్యకర కామెంట్లు పెట్టారు: రష్మి
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-f2687b72d32333f0b6764d8437f4ab7b0f109563.jpg)
- నేను జబర్దస్త్ లోకి వచ్చే సమయానికే అనసూయకు మంచి ఫాలోయింగ్ ఉంది
- మా మధ్య పోటీనే తప్ప, అసూయలు లేవు
- హోం ఫుడ్ తినాలనిపిస్తే.. అనసూయ ఇంటికే వెళ్తా
జబర్దస్త్ యాంకర్లు అనసూయ, రష్మిలు మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ఒకరికొకరు ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. అయితే, జబర్దస్త్ ప్రోగ్రామ్ లోకి తాను వచ్చిన సమయంలో తాను ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులను రష్మి పంచుకుంది. తాను జబర్దస్త్ లోకి వచ్చే సమయానికి అనసూయ అప్పటికే 13 ఎపిసోడ్లు చేసిందని చెప్పింది. అప్పటికే అనసూయకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని... అప్పట్లో తమ ఇద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ, అసూయలు మాత్రం లేవని తెలిపింది. యాంకరింగ్ లో ఎవరి స్టైల్ వారిదే అని చెప్పింది.
అయితే, ఆ సమయంలో అనసూయ అభిమానులు తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్లు పెట్టారని... వాటిని చూసి తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని రష్మి తెలిపింది. కానీ, ఆ తర్వాత జబర్దస్త్ టీమ్ ఇచ్చిన ప్రోత్సాహంతో నెమ్మదిగా కోలుకున్నానని చెప్పింది. అనసూయకు, తనకు మంచి సంబంధాలు ఉన్నాయని... ఎప్పుడైనా తనకు హోం ఫుడ్ తినాలనిపిస్తే, అనసూయ ఇంటికే వెళ్తానని తెలిపింది.