Chandrababu: చంద్రబాబును ప్రశంసించిన మోదీ.. బాబు సలహాలు తీసుకున్న ఈశాన్య రాష్ట్రాల సీఎంలు

  • విద్యుత్ రంగంలో చంద్రబాబు కృషిని అభినందించిన మోదీ
  • ప్రత్యేక హోదాకు మద్దతు పలికిన నితీష్, నారాయణస్వామి
  • బాబు నుంచి సలహాలు తీసుకున్న ఈశాన్య రాష్ట్రాల సీఎంలు

ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని మోదీ సైతం ఆయనను ప్రశంసించారు. విద్యుత్ రంగంలో చంద్రబాబు చేసిన కృషి అభినందనీయమని అన్నారు. మరోవైపు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగంతో అనుసంధానం చేయాలన్న చంద్రబాబు ప్రతిపాదనకు చాలా మంది సీఎంలు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రతిపాదనపై ముఖ్యమంత్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు.

మరోవైపు, లంచ్ బ్రేక్ సమయంలో చంద్రబాబును ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిశారు. పాలనకు సంబంధించి ఆయన నుంచి సలహాలు తీసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న చంద్రబాబు డిమాండ్ ను బీహార్ సీఎం నితీష్ కుమార్, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామిలు సమర్థించారు.

Chandrababu
modi
north east states
cm
  • Loading...

More Telugu News