jagan: నాన్నా.. మీరు మా అందరి మధ్యే ఉన్నారని భావిస్తున్నాం: జగన్

  • ఫాదర్స్ డే సందర్భంగా తండ్రిని గుర్తుకు తెచ్చుకున్న జగన్
  • ఎంత ఎత్తుకు ఎదిగినా.. గుర్తుకు తెచ్చుకునేది తండ్రినే
  • రాష్ట్రమంతా నాన్నను స్మరించుకుంటుండటం అదృష్టంగా భావిస్తున్నా

ఫాదర్స్ డే సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా ఈ సందర్భంగా తన తండ్రి, దివంగత రాజశేఖరరెడ్డిని గుర్తుకు తెచ్చుకున్నారు. "జీవితంలో మనం ఏ స్థాయికి ఎదిగినా, ఎంత ఎత్తుకు చేరినా స్మరించుకునేది నాన్ననే. నేనే కాకుండా, యావత్ ఆంధ్ర రాష్ట్రమంతా నా తండ్రిని స్మరించుకుంటుండటం అదృష్టంగా భావిస్తున్నా. హ్యాపీ ఫాదర్స్ డే. మీరు ఇప్పటికీ మా అందరి మధ్యే ఉన్నారని విశ్వసిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు, జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో కొనసాగుతోంది. 

jagan
ys rajasekhara reddy
fathers day
tweet
  • Error fetching data: Network response was not ok

More Telugu News