Aravind Kejriwal: కేజ్రీవాల్ భార్యను కలిసిన నలుగురు సీఎంలు!

  • గత ఐదు రోజులుగా అరవింద్ కేజ్రీవాల్ దీక్ష
  • ఆయన్ను కలిసేందుకు సీఎంలను అనుమతించని ఎల్జీ
  • కేజ్రీవాల్ భార్య సునీతను కలిసి సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రులు

గత ఐదు రోజులుగా న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయంలో దీక్ష చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు ప్రయత్నించి విఫలమైన నలుగురు సీఎంలు చంద్రబాబు, పినరయి విజయన్, మమతా బెనర్జీ, కుమారస్వామిలు ఆయన భార్య సునీతను కలిసి సంఘీభావం తెలిపారు. ఎల్జీ తీరుకు నిరసనగా కేజ్రీవాల్, మంత్రులు నిరసన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ టీమ్ ను పరామర్శించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని సీఎంలు కోరగా, అనిల్ బైజల్ నిరాకరించారు.

సునీతను కలిసిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, సమాఖ్య వ్యవస్థలో ఇటువంటి పరిస్థితి దారుణమని వ్యాఖ్యానించారు. వెంటనే పరిస్థితిని సమీక్షించి, సమస్యలు తొలగేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పని చేయాలని సలహా ఇచ్చారు. పినరయి విజయన్ మాట్లాడుతూ, దేశమంతా కేజ్రీవాల్ వెనుక ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

Aravind Kejriwal
Chandrababu
Sunita
New Delhi
Kumaraswamy
Mamata Benarjee
  • Loading...

More Telugu News