Jet Airways: విమాన ప్రయాణికులపై కఠిన నిబంధన... ఇక ఒకే చెకిన్ బ్యాగ్ అంటున్న జెట్ ఎయిర్ వేస్!

  • చెకిన్ బ్యాగ్ బరువు 15 కిలోలకు పరిమితం
  • ప్రీమియం క్లాస్ అయితే రెండు బ్యాగులకు అనుమతి
  • జూన్ 15 తరువాత కొనుగోలు చేసిన టికెట్లపై అమలు

దేశీయ విమాన ప్రయాణికులపై తీవ్ర ప్రభావాన్ని చూపే నిర్ణయాన్ని జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. ఇకపై ఎకానమీ క్లాస్ లో ప్రయాణించే ప్రయాణికులకు ఒకే చెకిన్ బ్యాగ్ ను అనుమతించాలని సంస్థ నిర్ణయించింది. శుక్రవారం నుంచి ఈ నిబంధనను అమలు చేస్తున్నట్టు తెలిపిన సంస్థ చెకిన్ బ్యాగ్ 15 కేజీలకు మించరాదని తెలిపింది. ప్రీమియర్ క్లాస్ ప్రయాణికులైతే రెండు చెకిన్ బ్యాగులు తీసుకు వెళ్లవచ్చని తెలిపింది.

 జెట్ ప్లాటినమ్ కార్డు వినియోగదారులకు ఇంకాస్త వెసులుబాటు ఇస్తూ, ఎకానమీలో 15 కిలోల వరకూ బరువుండే రెండు, ప్రీమియం క్లాస్ లో 25 కిలోల వరకూ బరువుండే రెండు బ్యాగులను తీసుకు వెళ్లవచ్చని తెలిపింది. జూన్ 15కన్నా ముందు కొనుగోలు చేసిన టికెట్లపై ఈ నిబంధనలు వర్తించవని తెలిపింది. కాగా, పలు ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సర్వీసుల్లో చెకిన్ బ్యాగ్ నిబంధనలుండగా, ఇప్పుడు దేశవాళీ ప్రయాణంపైనా ఇటువంటి నిబంధనలు విధిస్తుండటం గమనార్హం.

Jet Airways
Check In
Luggage
Airlines
  • Loading...

More Telugu News