KCR: ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం!

  • శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ కన్నుమూసిన కేశవ రావు జాదవ్
  • తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఎంతో పోరాడారన్న కేసీఆర్
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

అణగారిన వర్గాల జన గొంతుక, పౌరహక్కుల సంఘం నేత, తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవ రావు జాదవ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఎంతో పోరాడారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా కేశవ రావు జాదవ్ గత కొంత కాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఈరోజు కన్నుమూశారు.

KCR
Hyderabad
Hyderabad District
Telangana
  • Loading...

More Telugu News